![]() |
![]() |

'కృష్ణ ముకుంద మురారి' స్టార్ మా టీవీలో వస్తోన్న సీరియల్.... రోజు రోజుకి ఎంతో ఆసక్తికరంగా సాగుతూ 58వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. కుటుంబమంతా కూడా భోగి స్నానాల వేడుకల్లో పాల్గొన్నారు. నవ దంపతులయిన కృష్ణ-మురారి ఇద్దరూ సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుంకుంటూ స్నానాల్లో పాల్గొన్నారు. వాళ్ళిద్దరిని చూసి ముకుంద ఓర్వలేకపోతుంది.
"పాపం అందరూ సంతోషంగా ఉన్నారు. ఆదర్శ్ కూడా ఉంటే ముకుంద ఈ వేడుకల్లో ఆనందంగా పాల్గొనేది" అని జాలిపడుతుంది భవాని. ఆ తర్వాత భవాని ఇంటికి విజయ్ వస్తాడు. విజయ్ రావడంతోనే మురారికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ముకుందతో తన ప్రేమ వ్యవహారం ఎక్కడ బయట పడుతుందోనని హడావిడి చేస్తుంటాడు. అంతలోనే ముకుంద వచ్చి "బాబాయ్ బాగున్నారా" అని పలకరించి వెళ్ళిపోతుంది. మన ప్రేమ విషయం బయట పెట్టడానికే విజయ్ ని రప్పించానని మురారితో చెప్తుంది ముకుంద.
కృష్ణ దగ్గరికి మురారి వెళ్లి నువ్వు ఇంకా రెడీ కాలేదా.. కింద అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా కట్టుకో అని చెప్తాడు. "నువ్వు లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ మీ భార్య ఎక్కడ అని ప్రశ్నలు వేస్తారు.. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు చీర కట్టుకో" అని చెప్తాడు మురారి. "నువ్వు ఇక్కడ ఉండగా నేను చీర ఎలా కట్టుకుంటా" అని చెప్తుంది. అతని కళ్ళకు గంతలు కట్టి కృష్ణ చీర కట్టుకుంటుంది. ఇక ఇద్దరు గదిలో నుండి బయటికి రాగానే, ముకుంద కూడా తన గదిలో నుండి బయటికి వస్తుంది. అటువైపు ముకుంద, ఇటు వైపు కృష్ణతో మురారి మెట్లు దిగుతుంటే.. "ఇంకొక అమ్మాయి ఎవరు" అని భవానిని అడుగుతాడు విజయ్. ఆదర్శ్ భార్య అని చెప్తుంది భవాని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఆ తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |